బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థి ఆత్మహత్య
Student Suiside In Basara IIIT:నిర్మల్ జిల్లా బాసర బాసర ట్రిపుల్ ఐటీ లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన రాథోడ్ సురేష్ ఈరోజు బిహెచ్1 హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి ఆత్మహత్యపై డైరెక్టర్ సతీష్ కుమార్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఘటన కు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది