కవితక్కకు అండగా సింగరేణి
-బీజేపీ నేతల చర్య అప్రజాస్వామికం
-కల్వకుంట్ల కవితను కలసిన TBGKS నేతలు
టీబీజీకేస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటనే తెలంగాణ సమాజం మొత్తం ఉంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. లిక్కర్ కుంభకోణంపై అసత్యపు ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు. గురువారం TBGKS నేతలు కల్వకుంట్ల కవితను కలిశారు. కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ గూండాలు దాడికి తెగబడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డలా కాకుండా తెలంగాణ ఆడబిడ్డగా రాష్ట్రం కోసం కవిత పోరాటం చేశారని గుర్తు చేశారు. దౌర్జన్యాలకు దిగేవారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ద్వజమెత్తారు. సింగరేణి కార్మికులంతా మీకు తోడుగా ఉంటారని వెల్లడించారు.
ఈ అసత్యపు ఆరోపణలు చేసిన బిజెపి నేతలలకు బుద్ది చెపుతామన్నారు. కార్యక్రమంలో టీబీజీకేస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, టీబీజీకేస్ యువత టీబీజికేస్ సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.