దళితుణ్ణి కాబట్టే వివక్ష చూపుతున్నారు
-ప్రేంసాగర్ రావు బాల్క సుమన్ తొత్తు
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.3 కోట్లు తీసుకున్నాడు
-భార్యాభర్తలు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
తాను దళితుణ్ణి కాబట్టే వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎఐసిసి సభ్యుడు కొక్కిరాల ప్రేమ సాగర్ , డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తనపై వివక్ష చూపుతున్నాడని ఆరోపించారు. సమావేశానికి తనను ఆహ్వానించలేదని గాంధీభవన్ కు చెబితే వాళ్ళు ఆహ్వానం పంపించారని అన్నారు. సమావేశానికి వచ్చిన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. AICC సెక్రటరీ రోహిత్ చౌదరి సాక్షిగా తనను అవమానించారని అన్నారు.
ప్రేమసాగర్ రావ్ బాల్క సుమన్ తొత్తుగా వ్యవహిస్తున్నారని అందుకే చెన్నూరు లో రమేష్ అనే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండే విఠల్ దగ్గర రూ.3 కోట్లు తీసుకున్నారని తెలిసిందన్నారు. తనను అవమానించినందుకు సమావేశ సభను బైకాట్ చేస్తున్నట్లు నల్లాల ఓదెలు ప్రకటించారు.