భూపాలపల్లి బొగ్గు గనిలో మిస్ఫైర్
నలుగురు కార్మికులకు గాయాలు

Misfire in Bhupalpalli coal mine: సింగరేణిలోని భూగర్భ గనిలో మిస్ ఫైర్ తో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం సింగరేణి గనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన సింగరేణి కార్మికులను ఆసుపత్రికి తరలించారు. కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (8వ గని) అండర్ గ్రౌండ్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో రామకృష్ణ, శ్రీనివాస్, రాజశేఖర్, ప్రకాష్ అనే కార్మికులకు గాయాలు అయ్యాయి. కోల్ కట్టర్ మిస్ ఫైర్ తో ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.