రైతు నేస్తం పురస్కారాలు అందజేత
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఇచ్చే రైతు నేస్తం అవార్డులను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందచేశారు. శనివారం గన్నవరం దగ్గర ఆట్కూరు వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతువిభాగం, శాస్త్రవేత్తల విభాగం,విస్తరణ విభాగం,అగ్రి జర్నలిజం విభాగాల్లో ఈ పురస్కారాలు అందించారు. విస్తరణ విభాగంలో హైద్రాబాద్ కు చెందిన కె. శివప్రసాద్ (డిడిఏ)కు ఈ రైతు నేస్తం పురస్కారం అందించారు.ముప్పవరం ఫౌండేషన్, రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శివప్రసాద్కు అవార్డ్ రావడం పట్ల ఉద్యోగులు, వ్యవసాయ శాఖ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.