రక్షణ చర్యలను విస్మరిస్తోన్న సింగరేణి
-అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి
-సింగరేణి కోల్ మెన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
![](https://naandinews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-8.11.24-PM.jpeg)
Singareni ignoring protective measures: సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలను విస్మరిస్తోందని సింగరేణి కోల్ మెన్స్ కార్మికసంఘ్ (బిఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ ఏరియా RK7 గనిలో గురువారం ఉదయం సుమారు 4 గంటల సమయం మూడవ షిఫ్ట్ బ్యాంకేటుపై పనిచేస్తున్న రమేష్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. పది రోజుల నుండి జూనియర్ కార్మికులతో బలవంతంగా విధులు చేయిస్తున్నారని, అనుభవం లేకపోవడంతో గని ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని యాదగిరి సత్తయ్యతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్ డిమాండ్ చేశారు. ఆగస్టు 30న కొత్తగూడెం ఏరియాలో జరిగిన సేఫ్టీ ట్రైపార్టెంట్ సమావేశంలో యాజమన్యానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చినా కనీసం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మైండ్స్ రూల్స్ ప్రమాదాలు నివారణకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఆ తర్వాతే విధులకు అనుమతించాలని కోరామన్నారు. మైనింగ్ అధికారుల కొరత ఉన్నదని సమావేశంలో చెప్పామన్నారు. మైనింగ్ అధికారులను భూగర్భ గనులలో కాకుండా ఉపరితలంలో వేరే శాఖలకు కేటాయించిన వారిని వెంటనే తిరిగి భూగర్భగనుల్లో నియమించాలని సూచించామన్నారు. అయినా, ప్రమాదాలు జరుగుతున్నాయని దీనికి బాధ్యులైన అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.