ఈటెలదే గెలుపు
ఎగ్జిట్ పోల్ ఫలితాలు
హుజురాబాద్ ఎన్నికల్లో విజయం ఈటెల రాజేందర్ నే వరిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం ఎన్నికలు ముగియగా సాయంత్రం వరకే ఆయా సంస్థలు తమ ఫలితాలు వెల్లడించాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళి, ఓటర్ల మనోగతం అన్నిటిని పరిశీలించి ఫలితాలు విడుదల చేసాయి. పొలిటికల్ లాబ్, మిషన్ చాణక్య, ఆత్మసాక్షి, పబ్లిక్ పల్స్ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేలో ఈటలకే ఆధిక్యత కనిపించింది. కొన్ని సంస్థలు ఈటలకు 50 శాతం పైగా ఓట్లు పడతాయని చెప్పగా, మరికొన్ని అటుఇటుగా అంతే శాతం వస్తాయని స్పష్టం చేశాయి.
ఆత్మసాక్షి సర్వే..
బీజేపీ – 50.5
టీఆర్ఎస్ – 43.1
కాంగ్రెస్ – 5.7
పబ్లిక్ పల్స్ సర్వే..
బీజేపీ – 50.9
టీఆర్ఎస్ – 44.3
కాంగ్రెస్ – 2.7
మిషన్ చాణక్య సర్వే..
బీజేపీ – 55.68
టీఆర్ఎస్ – 36.56
కాంగ్రెస్ – 4.77