పేర్లలో తప్పిదానికి అభ్యర్థులే బాధ్యులు
-ఆన్ లైన్ లోనే దరఖాస్తుల స్వీకరణ
-మూల్యంకనం కూడా ఆన్ లైన్ లోనే
-అభ్యర్థులు ఆన్ లైన్లో -ఎంటర్ చేసిన పేర్లతోనే హాల్ టికెట్ల జారీ
-మెరిట్ జాబితాలోనూ అవే పేర్లు
-జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఫలితాలపై మీడియా కథనాలపై డైరెక్టర్ చంద్రశేఖర్
Candidates are responsible for any mistake in names in the examination: సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా రావడంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై డైరెక్టర్(పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ సోమవారం వివరణ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం కేవలం ఆన్ లైన్ లోనే ప్రక్రియ ద్వారానే అప్లికేషన్లను స్వీకరించామన్నారు, అభ్యర్థుల నుంచి హార్డు కాపీలను పంపించమని కోరలేదన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారి వివరాలను ఆన్ లైన్ లోనే సరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా స్వీకరించిన అప్లికేషన్ల ప్రకారం హాల్ టికెట్లను ఆల్ లైన్ ద్వారానే జారీ చేసినట్లు స్పష్టం చేశారు. రాత పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయగా.. అందులో అభ్యర్థుల పేరుకు బదులు రాష్ట్రం పేరు, క్వాలిఫికేషన్ వివరాలు రావడంపై సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయన్నారు. దీనిపై జేఎన్‌టీయూ అధికారులతో మాట్లాడి పూర్తిగా పరిశీలించిన అనంతరం అభ్యర్థులు వివరాలను సేకరించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలోనే వారు పొరపాటుగా వారి పేరు స్థానంలో తప్పుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిగ్రీ, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని టైప్ చేశారని వెల్లడించారు .
ఆన్ లైన్ ప్రకియలోనే హాల్ టికెట్లను జారీ చేయడం, మూల్యంకనం కూడా కంప్యూటర్ ఆధారంగానే ఉండటం, ఫలితాలు కూడా కంప్యూటర్ జనరేటెడ్ షీట్లే కావడం వల్ల ఆ నలుగురు అభ్యర్థులు ఎంటర్ చేసిన పేర్లతోనే మెరిట్ జాబితా ముద్రితమైందని తెలిపారు. పేర్లను తప్పుగా నమోదు చేసినా అభ్యర్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని వారి ఫోటో, పుట్టిన తేదీ, తండ్రి పేరు, వారి సంతకాన్ని పోల్చి చూసి పరీక్ష నిర్వాహకులు వారిని పరీక్ష కు అనుమతించినట్లు చెప్పారు. మెరిట్ జాబితాలో పేర్లు తప్పుగా రావడానికి అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు నింపే సమయంలో చేసిన తప్పిదమే కారణమన్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరారు.
పేర్లు తప్పుగా ఎంటర్ చేసిన ఆ నలుగురు అభ్యర్థుల వివరాలు సైతం వెల్లడించారు.
హాల్ టికెట్ నెం. 3308978 ఉన్న అభ్యర్ధి పేరు బి. శ్రీను, S/o బానొత్ వీరన్న స్ధానంలో Board of Secondary Education, ST కేటగిరి, ర్యాంక్ 34735 అని అభ్యర్ధి సెంటర్: శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, (సెంటర్-a) యాంనంపేట్, ఘట్కెసర్, హైదరాబాద్, అభ్యర్ధి అడ్రెస్: సి-62, ఒరిపక్క తండా, గుండెపూడి, మరిపెడ, మహబూబాబాద్ – 506315 సెల్: 9705370017
హాల్ టికెట్ నెం. 2204302 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు ఏ. మణికంఠ, S/o అర్రికట్ల వెంకటేశ్వర్లు స్ధానంలో Andhra Pradesh SC కేటగిరి, ర్యాంక్ 31187 అని అభ్యర్ధి సెంటర్: మల్లా రెడ్డి కాలేజీ, గండిమైసమ్మ, ధూలపల్లి, హైదరాబాద్, అభ్యర్ధి అడ్రెస్: 10-5-338/8/6, తుకారాం గేట్, నార్త్ లాలాగూడ, మారేడుపల్లి, సికింద్రాబాద్- 500017 సెల్: 9393101095
హాల్ టికెట్ నెం. 2218581 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు బి. లలిత, S/o బోడ బాబు స్ధానంలో Degree ST కేటగిరి, ర్యాంక్ 34172 అని అభ్యర్ధి సెంటర్: ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సెంటర్ -a) లక్ష్మణ్ రెడ్డి అవెన్యూ, గండిమైసమ్మ, ధుండిగల్, హైదరాబాద్, అభ్యర్ధి అడ్రెస్: 5-142, చంద్రా తండా, తిరుమలాయపాలెం, ఖమ్మం – 507183 సెల్: 9908683160
హాల్ టికెట్ నెం. 7709069 కలిగి ఉన్న అభ్యర్ధి పేరు వి. శ్రీధర్, S/o వడ్లకొండ సత్తయ్య స్ధానంలో Telengana BCB కేటగిరి, ర్యాంక్ 4026 అని అభ్యర్ధి సెంటర్: వాగ్దేవి డిగ్రీ కాలేజీ, ఐబి చౌరస్తా, మంచిర్యాల, అభ్యర్ధి అడ్రెస్: 8-4-19, S/o వి. సత్తయ్య, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి- 505209 సెల్: 8465946373 ర్యాంక్ , కేటగిరి యధావిధిగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.