కనువిందు చేసిన ఇంద్రధనుస్సు
An eye-catching rainbow: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్‌లో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండగా మంగళవారం వర్షం తగ్గి తెరిపినిచ్చింది. సాయంతం వేళలో వచ్చిన వెలుతురులో తుంపర్ల మధ్య ఇంద్ర ధనుస్సు తళుకులీనింది. దీంతో ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనుస్సు ప్రజలను ఆకట్టుకొంది. వాతావరణంలో ఏర్పడిన మార్పువల్ల ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వాతావరణం ఆకట్టుకుంది. అదే సమయంలో ఆకాశంలోని నలుపు తెలువు మబ్బుల మధ్య ఏర్పడిన రంగురంగుల ఇంద్రధనస్సు చూపరులను కనువిందు చేసింది.