రైలులో కాన్పు చేసి కాపాడిన వైద్యవిద్యార్థిని..

The medical student who gave birth in the train and saved: దురంతో ఎక్స్ ప్రెస్… సికింద్రాబాద్ నుంచి విశాఖ బ‌య‌ల్దేరింది. తెల్లవారుజామున రాజమహేంద్రవరం ద‌గ్గ‌రికి రాగానే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ మ‌హిళ భ‌ర్త అంద‌రినీ అర్ధించారు.. సాయం చేయాల‌ని క‌నిపించిన వారిన‌ల్లా ప్రార్థించారు. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ వైద్యవిద్యార్థిని ఆమెకు పురుడు పోసింది.

దురంతో ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తున్న సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె భర్త సత్యనారాయణ అంద‌రినీ సాయం అడ‌గ‌డంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి వెంటనే స్పందించింది. సత్యవతిని పరీక్షించింది. తోటి మహిళల సహాయంతో పురుడు పోసింది. ఆడ‌పిల్ల పుట్టింది. సత్యవతి, సత్యనారాయణది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆ రైలుకు విశాఖ వెళ్ళేదాకా ఎక్కడా హాల్ట్ లేదు. సత్యవతి పరిస్థితి గురించి టీటీఈ అందించిన సమాచారం మేరకు అనకాపల్లిలో స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వరరావు రైలు ఆపించారు. 108 అంబులెన్స్‌లో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గైనకాలజిస్ట్ అనురాధ తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేశారు. బిడ్డకు వైద్య సహాయం అందేవరకు స్వాతిరెడ్డి వారి వెన్నంటే ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like