మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం
రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి
Ramagundam Commissioner gave an insight into She Teams:బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని, ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో మహిళల భద్రతకోసం ” షీ టీం అవగాహన” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు, పిల్లలు, విద్యార్థిని ల మహిళల రక్షణ కోసం 24 గంటల పాటు షీ టీం సిబ్బంది మఫ్టీల్లో ప్రధాన కూడళల్లో, స్కూల్స్, బస్టాండ్, కళాశాలల వద్ద, రద్దీ ప్రదేశాలలో సామాన్య జనాల్లో ఉంటూ వారికి భద్రత కల్పిస్తామన్నారు.
పెద్దపెల్లి జిల్లాకు సంబంధించిన రామగుండం పోలీస్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ లో, మంచిర్యాల జోన్ కి సంబంధించి మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో షీ టీమ్స్ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ సమయంలోనైనా ఆపదలో ఉన్న వారు షీ టీమ్స్ ను సంప్రదించవచ్చని తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాలలో గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయవద్దని కోరారు. రామగుండం కమిషనరేటు పరిధిలో 124 దరఖాస్తులు వచ్చాయని, షీ టీమ్ ల ద్వారా 20 ఎఫ్.ఐ.ఆర్లు, 20 పిట్టీ కేసులు, 62 కౌన్సిలింగ్లు నిర్వహించామన్నారు. వేధింపులకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 5 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో 2వ స్థానం వచ్చిందని స్పష్టం చేశారు.
వేధింపులు, ఈవ్ టీజింగ్ కు గురయ్యే మహిళలు యువతులు, విద్యార్ధినిలు నిర్భయంగా రామగుండం ” షీ టీమ్స్ ” ను ఆశ్రయించాలని లేదా డయల్ 100, రామగుండం కమిషనరేట్ షీ టీమ్ వాట్సప్ నెంబర్ 6303923700, మంచిర్యాల జోన్ ఇంచార్జీ ఎస్.ఐ : 9866136140, పెద్దపల్లి జోన్ ఇంచార్జీ ఎస్.ఐ : 6309770712
ఫేస్బుక్ ఫేజ్ : sheteam.ramagundam,
FACEBOOK PAGE: https://www.facebook.com/pg/SHETEAMRGH
TWITTER: https://twitter.com/shoteamrgm
GMAIL:rgmsheteam@gmail.com
WEBSITE:
http://ramagundampolice.in ల్లో సంప్రదించాలని, ఆయా మాధ్యమాల ద్వారా నేరుగా ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.