స్పృహ తప్పిన 30 మంది విద్యార్థులు
30 students who lost consciousness: జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ప్రైవేటు పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు విద్యార్థులు రాగా, 11.30కు ర్యాలీ ప్రారంభించారు. విపరీతమైన ఎండ నేపథ్యంలో పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. దీంతో అధికారులువారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిళ్ల మేరకు పాఠశాల యజమాన్యాలు విద్యార్థులను వజ్రోత్సవాల్లో పాల్గొనడానికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడంతో విద్యార్థులు స్పృహ తప్పారని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పిల్లలని ఎండలో వెళ్లేందుకు పాఠశాల యాజమాన్యాలు ఎలా అనుమతించాయని దుయ్యబట్టారు.