ర్యాలీల‌కు చిన్నారులా..? సిగ్గుచేటు…

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

DCC president Kokkirala Surekha angry over taking children to rallies: జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుక‌ల్లో నిర్వ‌హించిన ర్యాలీలో చిన్నారుల‌ను తీసుకురావ‌డం ఏమిట‌ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రశ్నించారు. మంచిర్యాలలో శుక్రవారం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎండ తీవ్రతకు డీహైడ్రేష‌న్‌ కు గురై ఆసుపత్రిలో చేరడం బాధకరమన్నారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రెండు గంటల సేపు ఎండలో కూర్చోపెట్టడమే కాకుండా కనీసం తాగునీరు వసతి కల్పించకపోవడం క్షమార్హం కాదన్నారు. పైగా మూడు కిలోమీటర్ల దూరం ఎండలో చిన్న పిల్లలను నడిపించడం చూస్తుంటే కార్యక్రమం విజయవంతం పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై లేనట్లు కనిపిస్తోందని దుయ్య‌బ‌ట్టారు.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు విద్యార్థులను భాగస్వాములను చేయడం పట్ల కొక్కిరాల సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో విద్యార్థులను సభలు, సమావేశాలకు పిలవడం రివాజుగా మారిందన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ సమావేశాలకు సంఖ్యాబలం కోసం విద్యార్థులను పిలవడం విచారకరమని తెలిపారు. ఇక మీదట విద్యార్థులను ఏ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయవద్దని కోరారు. విద్యాసంస్థల యజమానులు కూడా విద్యార్థులను చదువుకు మినహా వారిని ఏ కార్యక్రమాలకు పంపవద్దని సూచించారు. విద్యా శాఖ అధికారులు విద్యార్థులను ఆయా కార్యక్రమాలకు విద్యార్థులను పంపించాలని ఆదేశిస్తే సహించేది లేదని సురేఖ స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like