అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం..
-కాన్వాయ్ కి అడ్డువచ్చిన కారు
-అద్దాలు పగులగొట్టిన భద్రతా సిబ్బంది
Security failure during Amit Shah’s visit: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హైదరాబాదులో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్ షా కాన్వాయ్ కి గుర్తుతెలియని ఒక కారు అడ్డు వచ్చింది. కారు వెంటనే పక్కకు తీయకపోవడంతో అమిత్ షా సెక్యూరిటీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టారు. ఈ సంఘటన హరిత ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది.
అయితే కేంద్ర మంత్రి కాన్వాయ్ కి అడ్డం పెట్టిన ఈ కారు ఎవరిదో, ఎందుకు అలా జరిగింది? అనే విషయం పై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. కారు నడుతుపుతున్న వ్యక్తి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గానికి చెందిన గోస్కుల శ్రీనివాస్ యాదవ్ గా గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.