కూతుర్లకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
A mother committed suicide by hanging her daughters: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని బలహీనవర్గాల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది.
చెన్నల ధనలక్ష్మి (23) తన ఇద్దరు ఆడపిల్లలు సమన్విత (6), శంకరమ్మ (6 నెలల చిన్నారి) కి ఉరి వేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. భర్త సాయన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చెన్నల సాయన్న కుటుంబం బతుకు దెరువు కోసం లక్షేట్టిపేటకు వలస వచ్చారు. మృతి కి గల కారణాలు తెలియాల్సి ఉంది.