కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి…

మృతి చెందిన ఐదేండ్ల చిన్నారి

A five-year-old girl died after drinking insecticide thinking it was a cool drink: కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ మండ‌లం భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, లావణ్య‌ దంపతులకు ఓ కొడుకు, కూతురు శాన్విక (5) ఉన్నారు. శాన్విక ఇంటివద్ద ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకుని ఓ బాటిల్‌లో ఉన్న పురుగుల మందు తాగేసింది. ఆ తర్వాత చిన్నారి వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టుగా డాక్టర్లు తెలిపారు. చిన్నారి మృతిలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగుల మందు నిల్వ ఉంచడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like