బ్రేకింగ్.. మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత
11 మంది ఆసుపత్రికి తరలింపు

Illness of students in minority gurukulam: కాగజ్ నగర్ మండలంలోని మైనారిటీ గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవటం లేదని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కూడా అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు వాంతులు, విరోచనాలు ఇబ్బందులు పడ్డారు. 11 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని అయినా సిబ్బంది పట్టించుకోవడం లేదని విద్యార్థులు వెల్లడించారు.