ఏసీబీ వలలో బుల్లెట్టు బండి ఫేమస్ పెళ్ళికొడుకు

Town planning officer in ACB trap:ఇంటి పర్మిషన్ కోసం ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బడంగ్ పేటలో ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి అనుమతుల కోసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అశోక్ రూ.30 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అశోక్ బాధితుడి దగ్గర లంచం తీసుకుటుండగా వలపన్ని పట్టుకున్నారు.
మున్సిపల్ కార్యాలయంతో పాటు అశోక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా అశోక్ పెళ్లిలో బుల్లెట్ బండి పాటకు ఆయన భార్య చేసిన డ్యాన్స్ పాపులర్ అయింది.