సీడీపీవో కార్యాలయం ఎదుట వ్యక్తి ఆందోళన
-వెహికిల్ టెండర్ ఇప్పిస్తానని మోసం చేశారు
-లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు
-నాకు న్యాయం చేయాలని వేడుకోలు

Concerned person in front of Bellampally CDPO office: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిడిపివో కార్యాలయం ఎదుట బైఠాయించి గోమాస ప్రసాద్ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. బెల్లంపల్లి సీడీపీవో ఉమాదేవి జిల్లా సంక్షేమాధికారిగా పని చేసిన సమయంలో తనకు వెహికల్ టెండర్ ఇప్పిస్తానని చెప్పారని వెల్లడించాడు. అందుకోసం లక్ష రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పారు. ఉమాదేవి భర్తకు ఆ డబ్బులు ముట్టచెప్పానని స్పష్టం చేశాడు. తనకు కాకుండా వేరే వారికి వెహికిల్ టెండర్ ఇచ్చారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. టెండర్ ఇప్పించకపోగా, డబ్బులు అడిగితే ఇవ్వడం లేదని ఆఫీసు ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వెల్లడించాడు.