సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం
ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్ అభిమానులు సంతాపం ప్రకటించారు.