కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలి
జమ్మూ వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు. హిమాలయాల అంచుల్లో గల జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఎంతో పరిపాలన దక్షత గల నేత అని వారు అభివర్ణించారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపినట్టు, భారతదేశాన్ని సైతం ప్రపంచంలో అగ్రగామిలా నిలుపూతారని వారు వెల్లడించారు. అదేవిధంగా కెసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.