గుండె పోటుతో మరో సింగరేణి కార్మికుడి మృతి
Another Singareni worker died of heart attack: ఐదు రోజుల కిందట ఓ కార్మికుడు గుండెపోటుతో మృత్యువాతపడగా, శనివారం ఉదయం మరో కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు గనిలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్న కందుగుల అంకులు (44) అనే కార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. పని చేస్తుండగా ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. కార్మికుడి మృతి విషయం తెలుసుకున్న తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి,కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి ,ఏరియా చర్చిల ప్రతినిధులు పెట్టం లక్ష్మణ్,వెంగల కుమారస్వామి రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ కు చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఉద్యోగం తో పాటు వారికి త్వరగా వచ్చేలాగా చూస్తామని హామీ ఇచ్చారు.