బెల్లంపల్లి ఏరియాలో కార్మికులను నియమించాలి

Workers should be recruited in Bellampally area:బెల్లంపల్లి ఏరియాలో ఎలక్ట్రీషియన్లు, జనరల్ మజ్దూర్ ల కొరత తీవ్రంగా ఉన్నదని వెంటనే 50 మంది కార్మికులను నియమించాలని డైరెక్టర్ ప్రాజెక్టు ప్లానింగ్ బలరాంని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మలరాజు శ్రీనివాసరావు, చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్ కోరారు. ఆదివారం బెల్లంపల్లి ఏరియా గోలేటి పర్యటనకు వచ్చిన డైరెక్టర్ బలరాంని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోలేటి గెస్ట్ హౌస్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.

ఈపీ టెక్నీషియన్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించాలని,గోలేటి డిస్పెన్సరీని పది పడకల ఆసుపత్రిగా చేయాలని కోరారు. గోలేటి ఓపెన్ కాస్ట్, MVK ఓపెన్ కాస్ట్ లను తొందరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. డైరెక్టర్ వెంట జనరల్ మేనేజర్ జి.దేవేందర్, ఎస్ఓటుజి ఎం గుప్తా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏరియా ఇంజనీర్ తిరుమలరావు తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like