ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు
30 వేల నగదు, సెల్ ఫోన్ సీజ్
Arrest of online betting operators: క్రికెట్ వచ్చిదంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. అయితే, అటు బెట్టింగ్ నిర్వాహకులకు ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. పెద్దఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గతంలోలాగా కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బెట్టింగ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఈ వ్యవహారంలో బ్రోకర్లుగా అవతారమెత్తిన వారంతా లాభ పడుతుండగా, బెట్టింగ్లు కాసిన వారి జేబులకు చిల్లు పడుతోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్ విషయంలో పలువురు బెట్టింగ్ చేస్తుండగా, పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారంతో బొక్కలగూడలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద 30 వేల నగదు, సెల్ ఫోన్ సీజ్ చేసారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టుకున్న ఇమ్రాన్ ను సీసీ ఎస్ పోలీస్ లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు .