కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి
జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతించిన లండన్ ఎన్ఆర్ఐలు
London NRIs who wanted KCR to enter the country’s politics: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని యూకే ఎన్ఆర్ఐలు కోరారు. ఆయన నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమని ఎన్నారైలు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఆయన క్రీయాశీలక పాత్ర పోషించి భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతి మార్చాలని కోరారు. ముఖ్యమంత్రికి మద్దతుగా వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా “దేశ్ కీ నేత కేసీఆర్” అంటూ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు ఎన్నారైలు పాల్గొన్నారు.