వాట్సప్ గ్రూపులో ఇక వెయ్యి మంది
A thousand more people in the WhatsApp group: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్‌డేట్స్ తీసుకొస్తోంది. తాజాగా తన ప్లాట్‌ఫారమ్ ద్వారా అడ్మిన్‌లకు మంచివార్త చెప్పింది. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసుకునే సభ్యుల సంఖ్యను మరోసారి పెంచింది. ఇప్పటి వరకు ఒక గ్రూప్‌లో 512 మందిని యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు చేసి, అడ్మిన్‌లలో జోష్ నింపింది. దీంతో ఈ అప్‌డేట్ తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మేలో వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ సంఖ్యను మారుస్తు 256 నుంచి 512కి మార్చింది. ఇప్పుడు వాట్సాప్ ఈ లిమిట్ కూడా రెట్టింపు చేస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ని బీటా టెస్టర్‌లకు లిమిట్ చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఇతర యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సప్ 2GB వరకు ఫైల్‌లను షేర్ చేయడానికి అప్‌డేట్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది.