ఇప్పుడు నేను డాక్టర్ సితక్క

నా జీవితంలో జరిగేవి అనుకోకుండా జరిగినవే.. ఇప్పుడు మీరు నన్ను డాక్టర్ సితక్క అని పిలోవచ్చు.. అని ములుగు ఎమ్మెల్యే సితక్క వెల్లడించారు. సీతక్క పొలిటికల్ సైన్స్ పిహెచ్ డీ చేసినట్లుతెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు.’నా చిన్నతనంలో నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు. నక్సలైట్ గా ఉన్నప్పుడు లాయర్ ని అవుతానని.. లాయర్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్ డి చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మీరు నన్ను డాక్టర్ అనుసూయ (సీతక్క) అని పిలవొచ్చు’ అని ట్వీట్ చేశారు.