కార్మికుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం
Financial assistance to workers’ families:వరదల్లో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు సిర్పూర్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున రూ.2 లక్షలు అందించారు.
భారీ వర్షాల కారణంగా దహేగాంలో రెండు నెలల కిందట సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు ఇద్దరు గల్లంతు అయ్యారు. అందులో అంబాల రాములు కుటుంబానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో ఈ రోజు కుటుంబ సభ్యులకు ఎం ఎల్ ఏ సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఈ లక్ష రూపాయలను అందచేశారు. అనంతరం చిలుక సతీష్ కుటుంబానికి సైతం లక్ష రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, దహేగాం జడ్పిటీసి రామారావు, టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తొంగల రమేష్ , డివిజన్ కమిటీ సభ్యులు పొగాకు రమేష్, నీలం సదయ్య, అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.