అప్పటి వరకు చెప్పులు వేసుకోను
మంత్రి సత్యవతి రాథోడ్
మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను చెప్పులు వేసుకొనని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ సారి కూడా మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన స్టేజి మీదనే తాను చెప్పులు వదిలేసినట్లు పేర్కొన్నారు. గిరిజనులందరి పక్షాన గిరిజన బిడ్డగా మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
తాను ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎవరిని సంప్రదించలేదని.. ఇప్పుడు ఎవరు వద్దన్నా వెనక్కి చూడనని చెప్పారు. రానున్నది ఎండాకాలమైనా సరే తాను చెప్పులు లేకుండానే తిరుగుతానని స్పష్టం చేశారు. మళ్ళీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే తిరిగి కాళ్లకు చెప్పులు ధరిస్తానని పేర్కొన్నారు. ఇది తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో తీసుకున్న నిర్ణయమన్నారు. పూర్తిగా తన వ్యక్తిగతమని వెల్లడించారు.