కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి
Concerned to give exagresia of 1 crore rupees: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవర్ ప్లాంట్ లో డోజర్ రిపేర్ చేస్తుండగా డోజర్ మీద పడి మృతి చెందిన చంద్రమోహన్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మిక సంఘాల నేతలు,,కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు ఈ సందర్భంగా సింగరేణి నాయకులు మాట్లాడుతూ సింగరేణి పవర్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే చంద్రమోహన్ మృతి చెందాడని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులను వెట్టి చాకిరి చేయించుకుంటూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నారన్నారు. మృతి చెందిన మోహన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరపగా సింగరేణి యాజమాన్యం వర్క్ మెన్ కాంపెన్సేషన్ కింద 13 లక్షలతో పాటు సింగరేణి యాజమాన్యం 37 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు మృతుడి కుటుంబంలో ఇద్దరికీ ఉద్యోగం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారన్నారు. కార్మికులు కుటుంబ సభ్యులు కార్మిక నేతలు చేసిన రాస్తారోకోతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒప్పంద అనంతరం వారు తమ ధర్నాని విరమించారు.