హత్య కేసులో ఆర్మీ జవాన్లు

Army soldiers in murder case:ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు ఆర్మీ జవాన్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హత్య కేసు వివరాలను ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి వెల్లడించారు.

బండారి కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో నివాసం ఉంటున్నాడు. లాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్న ఇతనికి ఏడేండ్ల కిందట పెళ్లి అయింది. అయితే వరుసకు కోడలు అయిన తాళ్ల పెళ్లి రమ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబందానికి దారి తీసింది. ఆ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండేవి. ఈ విషయంలో రమ్య అన్న తాళ్లపల్లి శివకుమార్, మేనమామ బండారి సంతోష్, ఆమె బాబాయ్ తాళ్లపల్లి రమేష్ కిరణ్ కుమార్ ని బెదిరించారు. పైగా రమ్య, కిరణ్ ఓ గుళ్లో దండలు సైతం మార్చుకున్నారు. దీంతో అతన్ని ఎలాగైనా హతమార్చలని ప్లాన్ చేసుకున్నారు.

ఇందులో తాళ్లపల్లి శివకుమార్, బండారి సంతోష్ ఆర్మీ లో పని చేస్తున్నారు. హైదరాబాద్ లో హత్య కు పథకం రూపొందించిన వీళ్ళు సంతోష్ ఫ్రెండ్స్ సాయం కూడా తీసుకున్నారు. చింతల సంతోష్, సిగ్గం రామకృష్ణా రెడ్డి కలసి కిరణ్ ను ఎలా చంపాలనే విషయంలో పక్కా స్కెచ్ వేశారు. బండారి కిరణ్ ను బండారి సతీష్, చింతల రోహిత్ రెడ్డి కలసి కారులో ఎక్కించుకుని అతనికి మద్యం తాగించారు. గుడిహతన్నూర్ డంపింగ్ యార్డ్ కు తీసుకువచ్చి మర్మాంగాలపై కొట్టి గొంతు పిసికి చంపేశారు.

తన భర్త ఆచూకీ తెలియడం లేదని ఈ నెల 1న కిరణ్ కుమార్ భార్య భాగ్యశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 8న అడవిలో పాతిపెట్టిన శవం గుర్తించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. తాళ్లపెళ్లి రమేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా హత్య విషయం వెల్లడించాడు. దీంతో పోలీసులు వెంటనే చింతల రోహిత్ రెడ్డి, సంగం రామకృష్ణ రెడ్డి ని సైతం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్మీ జవాన్లు బండారి సంతోష్, తాళ్ల పల్లి శివకుమార్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like