బ్రేకింగ్… కిడ్నాప్ కలకలం
తపంచా స్వాధీనం
kidnapping commotion: నిర్మల్ జిల్లాలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రవి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. కిడ్నాపర్ల వద్ద నుంచి ఓ పిస్టల్ సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రేపు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశంఉందని సమాచారం.