మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు
-విమెన్స్ హెల్ప్‌లైన్ 181, చైల్డ్‌హెల్ప్‌లైన్ 1098 గురించి కూడా తెలుసుకోవాలి
-చుట్టుపక్కల వారికి సైతం చెప్పాలి
-విద్యార్థినులకు అవగాహన కల్పించిన పోలీసులు

Many laws for the protection of women: సైబర్ నేరాలు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాలు తదితర అంశాలపై అవగాహన ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీ హర్ష డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయి అవగాహన అవసరమన్నారు. చిన్నారుల నుంచి వృద్దుల వరకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై విమెన్స్ హెల్ప్‌లైన్ 181, చైల్డ్‌హెల్ప్‌లైన్ 1098 అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ఈ రోజుల్లో సాంప్రదాయం మోసం కంటే సైబర్ నేరాలతో పెద్ద ముప్పు ఉందన్నారు.సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారికి అవగాహన కల్పించాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరం జరిగినప్పుడు మనం మోసపోయామని తెలిసిన వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. అకౌంట్లో డబ్బులు పోయిన వెంటనే సైబర్ క్రైం పోర్టల్‌లో కానీ, 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా మన అకౌంట్‌లో నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన సొమ్ము ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా నిలిపివేసే అవకాశం ఉంటుందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. వివిధ రకాల సైబర్ నేనాల నుండి స్త్రీలు మరియు పిల్లల భద్రతకు ముప్పుల గురించి చర్చ నిర్వహించారు. సైబర్ నేరాలపై, వాటి నివారణ మార్గాలపై చర్చించి వారికి క్విజ్ పోటీ నిర్వహించారు.
సోషల్ మీడియాలో వేధింపులు, బ్లాక్ మెయిల్, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, పోక్సో మాదకద్రవ్యాల వినియోగంపై యువత పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని బాలికల మహిళల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందన్నారు. మహిళల అక్రమ రవాణా, ఈవ్ టీజింగ్ ఎవరైనా గురైతే, ఆపదలో ఉన్నట్లయితే వెంటనే డయల్ 100, 108, 1098,181,సైబర్ క్రైమ్ జరిగితే 1930 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని ఫిర్యాదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో పాటు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆది మధుసూదన్, లచ్చన్న, షీ టీం ఇంచార్జ్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్, సైబర్ క్రైమ్ ఎస్ఐ మల్లేష్ లు కళాశాల ప్రిన్సిపాల్, టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.