ముసలోడిని అయిపోయా..
కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR tweeted that he is old: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “ఇన్ని రోజులు కంటి అద్దాలు పెట్టుకోవడం నామోషీగా ఫీలయ్యే వాడిని. కానీ ఇక ఆ తిప్పలు తప్పేలా లేవు. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా నేను చదవలేకపోతున్నా.. అఫీషియల్లీ ఓల్డ్” అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేస్తూ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు కేటీఆర్. కళ్లద్దాలతో జెంటిల్మెన్ ఉన్నావన్నా అంటూ అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు.