వాట్సప్ సేవలకు అంతరాయం

Disruption of WhatsApp services: వాట్సప్ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉన్నట్టుండి మధ్యాహ్నం 12.30 సమయంలో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. తమ మొబైల్ లో నెట్ వర్క్ పని చేయడం లేదేమోనని సందేహంతో ఫోన్లను స్విచ్చాఫ్ లేదా రీస్టార్ట్ చేశారు. అయినా అదే సమస్య కొనసాగింది. అయితే, దీనిపై అధికారికంగా వాట్సప్ పేరెంట్ ఆర్గనైజేషన్ అయిన మెటా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. వీలైనత త్వరగా సేవల్ని పునరుద్దరిస్తామని వెల్లడించింది.
మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు ఈ సేవలు నిలిచిపోయాయి. చివరకు 2.30 ప్రాంతంలో వాట్సప్ తన సేవలను పునరుద్దరించింది.