ఆ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు
కాంగ్రెస్ నేతలకు అధిష్టానం హెచ్చరిక
తెలంగాణ, ఆంధ్ర విలీనం విషయంలో ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలకు అధిష్టానం హెచ్చరిక లు జారీచేసింది. ఈ మేరకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సోనియా నిర్ణయంతో తెలంగాణ వచ్చిందన్నారు. అధికార దాహంతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ, ఆంధ్ర కలపాలని కుట్రలు చేస్తోందన్నారు. రెండు రాష్ట్రాలు కలపాలని అనడం జగ్గారెడ్డి సొంత అభిప్రాయం అన్నారు. అది పార్టీ నిర్ణయం కాదన్నారు. జగ్గారెడ్డి వ్యహారంలో వివరణ ఆడిగామని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన మాటిచ్చారని మధుయాష్కీ స్పష్టం చేశారు.
.