రోడ్డు ప్రమాదం లో నలుగురి మృతి
Four people died in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నుర్ మండలం సితాగొంది సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్ బొక్కల గూడకు చెందిన రఫతుల్లా కుటుంబం హైదారాబాద్ కార్ లో వెళ్ళి వస్తోంది. ఈ క్రమంలో వెనక నుంచి కారును లారీ డి కొట్టడంతో కారు ముందు వెళ్తున్న కంటైనర్ ను డి కొట్టింది. వెనక లారీ ముందు కంటైనర్ మద్య లో కారు ఇరుక్కుపోయింది.కారులో ఐదుగురు ఇరుకున్నారు.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని అందులో ఇరుకున్న వారి ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదం లో డ్రైవర్ షంశు, సయ్యద్ రఫతుల్లా అష్మి., వజాహత్ ఉల్ల్లా, సబియా అనే నలుగురు మృతి చెందగా జుబీయా అనే వైద్యురాలు కు తీవ్ర గాయాలయ్యాయి.
నాలుగు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపించగా జుబీయా కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.