రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Two killed in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. నేరడిగొండ మండలం కుప్టి బ్రిడ్జి పై న టిప్పర్, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో టిప్పర్ బ్రిడ్జి పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఉషారెడ్డి, రాజేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.