గన్ మిస్ ఫైర్: కానిస్టేబుల్ పరిస్థితి విషమం
Gun misfire: Constable’s condition critical: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కౌటాల పోలీస్ స్టేషన్లో 2020 బ్యాచ్ గుడిపేట బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ సూర రజనీ కుమార్ (29) విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 4:30 ప్రాంతంలో గన్ మిస్ ఫైర్ కావడంతో ఆయనకు గాయాలయ్యాయి. తల ప్రాంతంలో గాయమయ్యింది. రజినీ కుమార్ బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి కి చెందినవారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. గన్ మిస్ ఫైర్ అయ్యిందా..? లేక రజినీ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో సైతం విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అతన్ని కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ తరలించారు.