ఆదిలాబాద్ జిల్లాలో పులుల హల్చల్
పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గ్రామాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ రాంపూర్‌లో మంగళవారం రెండు పులులు సంచరించాయి.కెనాల్ లో నుంచి వెళ్తుండగా స్ధానికులు వీడియో తీశారు.
అధికారులకు సమచారం అందించడంతో.. రంగంలోకి దిగిన అధికారులు పులి మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.