టిఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థుల షాక్
గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే అవకాశం
హుజురాబాద్‌లో టీఆర్ ఎస్ భయపడింది అంతా జరిగింది. టిఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థుల షాక్ ఇచ్చారు. అక్కడ రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉందని ప్రచారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రచారం చేయాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చెప్పారు. అక్కడ సిలువేరు శ్రీకాంత్ అనే అభ్యర్థికి రోటీమేకర్ గుర్తు కేటాయించారు. ఆయనకు కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. మొదటి రౌండ్లో కాంగ్రెస్‌కు 119 ఓట్లు రాగా, శ్రీకాంత్‌కు 122 ఓట్లు వచ్చాయి. చివరికి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఆ అభ్యర్థి టీఆర్ ఎస్ గెలుపును ప్రభావితం చేసినట్టే.