రేపు బుగ్గలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని బుగ్గ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేపు (11-11-2022) శుక్రవారం రోజున సామూహిక రమా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి వెల్లడించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ఈ పూజలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు. పూజా సామగ్రి భక్తులు వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు మరిన్ని వివరాలకు 9701013831 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.