మోదీ సభకు తీసుకువెళ్ళి మోసం చేశారు
Narendra Modi: మోదీ సభకు తీసుకువెళ్లిన తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని చాలా ఇబ్బందులు పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ నుంచి 300 మందిని రామగుండంలో జరిగిన ప్రధాని మోది సభ కు తరలించారు.
అయితే ఉదయం నుండి రాత్రి వరకు నీళ్ళు, భోజన వసతి ఏర్పాటు చేయలేదని బాధితులు వాపోయారు. రోజు వారి కూలీ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల హై టెక్ సిటీ బీజేపీ పార్టీ కార్యలయం వద్ద ఆందోళనకు దిగారు.