కాలేజీలో విద్యార్థి అత్మహత్య
Student commits suicide in college: కాలేజీ లోనే ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర మైనార్టీ కాలేజీ లో మహ్మద్ ఫారహన్ నవాజ్ (17) అనే విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
భైంసా జైలబుద్దిన్ గల్లికి చెందిన ఫరహన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సంబందించి సుసైడ్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.