యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ నగరంలో నిర్వహించనున్న యువ సమ్మేళనం పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు.నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. వరంగల్ నగరంలోని ముందాడ భవనంలో సమితి అధ్యక్షులు వేణుగోపాల్ ముందాడ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నైజాం విముక్త అమృతోత్సవ సమితి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.రాంగోపాల్ రెడ్డి, చిట్టిమల్ల శ్యాంప్రసాద్, సభ్యులు చిలకం ఉపేందర్, పోకల జ్యోతిర్మయి, ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ కార్యవాహ ప్రొఫెసర్ గద్దె రమేష్, మహా నగర్ ప్రచారక్ నాగరాజు, శ్రీరామ్ శివాజీ, తౌటం తిరుమల్ ,కపిల్ జీ,పొకల రమణ,పిల్లి వెంకటేశ్వర్లు, భరత్,రాహుల్,శ్రీనాథ్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.