న‌డిరోడ్డుపై పులుల మంద

A herd of tigers on the road: ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు పులులు న‌డిరోడ్డుపై తిరుగాడుతుండ‌టం క‌ల‌క‌లం రేపింది. ఈ మ‌ధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరిగింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోళ్లగడ్ తాంసీ సమీపంలో 4 పెద్ద పులుల సంచరిస్తున్నాయి. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్ కు నిన్న రాత్రి పిప్పల్ కోటి రిజర్వాయర్ దగ్గర 4 పులులు కనిపించాయి. అదే టిప్పర్ నుండి డ్రైవర్ సెల్ పోన్ వీడియో తీశారు. ఈ నాలుగు పులుల సంచారానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కొరాట, గూడా, రాంపూర్, తాంసీ, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే పులుల భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.

వారం కింద‌ట‌ చెనాక కొరటా పంప్ హౌస్ సమీపంలో 2 పులులు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు మరో నాలుగు పులులు సంచరిస్తుండటంతో.. వాటిని పట్టుకోవాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 4 రోజుల నుండి పులుల కోసం గాలిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like