సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు
super-star-krishna-passes-away: సినీ ప్రముఖులు, సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ అభిమానులు త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్ధనలు ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారు జామున 4 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆసుపత్రిలో నిన్న ఆసుపత్రిలో చేర్పించారు. అయన పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. ఈ రోజు ఉదయం 4 గంటలకు అయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కృష్ణ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి మృతితో తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు , కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆలాగే ఆయన రెండో భార్య విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.
1943, మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు. 1960లో ఏలూరు సి.ఆర్.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ డిగ్రీ పట్టా అందుకున్నారు. కృష్ణ పాతాళభైరవి సినిమా చూసి.. ఎన్టీఆర్ కు అభిమానిగా మారారు. ఏఎన్నార్, సావిత్రి నటించిన ‘దేవదాసు’ శతదినోత్సవ వేడుకల్లో తెనాలికి వచ్చిన ఏఎన్నార్, సావిత్రిలు.. క్రేజ్ ను చూసిన కృష్ణకు నటనపై ఆసక్తి కలిగింది. అప్పుడే తాను కూడా హీరోగా మారాలని నిశ్చయించుకున్నట్లు కృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు.