అదనపు కలెక్టర్ వాహనం జప్తు

Additional collector’s vehicle impounded: నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు వాహనం ను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. పరిహారం చెల్లింపులో అధికారుల అలసత్వాన్ని తప్పుపడుతూ మంగళవారం కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన 21 మంది రైతుల 40 ఎకరాలకు నష్టపరిహారంలో చెల్లించడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినా ముంపు గ్రామ బాధితుల నష్ట పరిహారం చెల్లింపులో జాప్యంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అదనపు కలెక్టర్ కారును కోర్టు సిబ్బంది జప్తు చేశారు.