కోడలు మృతి : తట్టుకోలేక ఆగిన మామ గుండె
Death of daughter-in-law: uncle’s heart stopped: కోడలు మృతి చెందిదని మామ కూడా గుండె పోటుతో మరణించాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నింపిన ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తలొడిలో లలిత(30) అనే మహిళకు కుటుంబ నియత్రణ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం లలిత కోమాలోకి వెళ్ళింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణంచింది.
ఈ మరణ వార్త విన్న ఆమె మామ జులాజి (75) గుండె పోటుతో మృతి చెందాడు. కేవలం గంటల వ్యవధిలో మామ, కోడలు చనిపోవడం ఆ గ్రామంలో విషాదం నింపింది.