రేషన్ బియ్యం పట్టివేత
-ఇరవై ఎనిమిది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం
-బొలేరో వాహనం సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్
-పోలీసుల అదుపులో నిందితుడు
Sezied Of PDs Rice: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా బొలేరో వాహనంతో పాటు, 28 క్వింటాళ్ల రేషన్ బియ్యం బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెజ్జూర్ నుండి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో (టీఎస్ 20, టీ 4699) రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడు బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామానికి చెందిన వొజ్జల రాజన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బియ్యంతో పాటు బొలేరో వాహనాన్ని చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్ తెలిపారు.